News

ఆలయమంతా బంగారు వర్ణమే.. శరవేగంగా అయోధ్య రామమందిర పనులు

99views

ఉత్తర్‌ప్రదేశ్‌లో అయోధ్య రామమందిర నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. పసుపురంగు విద్యుత్‌ దీపాలతో ఆలయాన్ని ఆలంకరించనున్నామని, పనులన్నీ పూర్తయితే ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుందని ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వినోద్‌ మెహతా తెలిపారు. ‘‘2024 జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకు వీలైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విషయంలో పనులు త్వరగా పూర్తిచేయాలని ఎల్‌ అండ్‌ టీపై ఒత్తిడి ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. డిసెంబరు నాటికి పూర్తవుతాయి. ప్రస్తుతం స్తంభాలపైన శిల్పకళాకృతులు చెక్కుతున్నారు. ఆలయంలోని నృత్య మండపం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రంగమండపాన్ని డిసెంబరు నాటికల్లా నిర్మిస్తాం’’ అని మెహతా పేర్కొన్నారు.