News

ప్రపంచ హిందూ కాంగ్రెస్ 2023కి దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ శుభాకాంక్షలు

380views

ప్రముఖ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ నవంబర్ 24 నుండి 26 వరకు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ 2023కి తన హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు మద్దతును తెలియజేశారు.

“జయస్య ఆయత్నం ధర్మః” (ధర్మం, విజయానికి నిలయం) అనే ఇతివృత్తంతో నిర్వహించే ఈ మూడు రోజుల గ్లోబల్ ఈవెంట్‌కు వివిధ దేశాలకు చెందిన విభిన్నరంగాలకు చెందిన హిందువులు హాజరు కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు అవకాశాలపై చర్చించడం ప్రపంచ హిందూ కాంగ్రెస్ ముఖ్యోద్దేశం. అలాగే హిందూ సమాజంలోని నాయకులు, కార్యకర్తలు మరియు ఆలోచనాపరుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ హిందూ కాంగ్రెస్ 2023‌కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్‌ జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అమృత విశ్వ విద్యాపీఠం ఛాన్సలర్ మా అమృతానందమయితో సహా గౌరవనీయ వ్యక్తులకు ఆహ్వానాలు ఇప్పటికే అందాయి. హిందూ సంస్థలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బౌద్ధ గురువులను కూడా ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే, “అందరికీ నమస్తే! బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ హిందూ మహాసభలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దురదృష్టవశాత్తూ, ప్రపంచకప్ కమిట్‌మెంట్‌ల కారణంగా నేను అక్కడ ఉండలేను. అయితే నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది అద్భుతమైన సంఘటన అని ఆశిస్తున్నాను. జై శ్రీ రామ్,’’ అంటూ WHC 2023 నిర్వాహకులను ఉద్దేశించి క్రికెటర్ కేశవ్ మహారాజ్ తన వీడియో సందేశాన్ని అందించారు.