News

బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు

264views

లండన్ వేదికగా దీపావళి సంబరాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తు ప్రధాని నివాసం అధికారిక భవనంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగాయి. దీపావళి వేడుకలకు హిందూ బంధువులను ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఆహ్వానించారు. చీకటిపై వెలుతురు విజయ సూచకంగా దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను ప్రధాని రిషి సునాక్ అధికారిక ఖాతాలో పంచుకున్నారు.

అక్షతా మూర్తి దీపాలను వెలిగిస్తుండగా.. ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్న ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. యూకే, ప్రపంచమంతటా దీపావళి వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.