News

పద్మావతి అమ్మవారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ల‌క్షకుంకుమార్చ‌న‌

264views

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 10 నుండి 18వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా ల‌క్ష‌కుంకుమార్చ‌నను టిటిడి నిర్వహించింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య కుంకుమార్చనను ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈరోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంకురార్పణ జరుగనుంది. రాత్రి 9గంటల 30నిమిషాల వరకు పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు టిటిడి నిర్వహించనుంది. రేపు ఉదయం 9.10 నుండి 9.30 గంటల మ‌ధ్య ధ‌నుర్‌ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి. తొమ్మిదిరోజు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టిటిడి పూర్తి చేసింది.