News

హిందువుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

417views

హిందువులు, పూజారుల‌ను అవ‌మానించేలా దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అఫ్తాబ్ ఉద్దిన్ మొల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. గువ‌హ‌టిలో ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌధురి నివాసం నుంచి మొల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హిందూ ఎక్కుడుంటే అక్క‌డ త‌ప్పులు జ‌రుగుతాయ‌ని, మందిర్ పూజారులు, నామ్‌ఘ‌ర్ కేర్‌టేక‌ర్స్ రేపిస్టుల‌ని ఎమ్మెల్యే మొల్లా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన మొల్లాకు అసోం ప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఈనెల 5న షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

కాగా న‌వంబ‌ర్ 4న గోల్‌పారా జిల్లాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్య‌లు చేశారు. దిస్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌లో మొల్లాపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదైంది.