News

టీటీడీలో ఉద్యోగాలు: భారీగా వేతనం, వెంటనే అప్లై చేయండి

304views

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 23లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాలు: 56
విభాగాల వారీగా..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 10 పోస్టులు
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్: 19 పోస్టులు

విద్యార్హత:
బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్ సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమతి: 42 ఏళ్లు మించరాదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపకి చేస్తారు.

వేతనం నెలకు: ఏఈఈకి రూ. 57,100-1,47,760
ఏఈకి రూ. 48,440-1,37,220
ఏటీవో: రూ. 37,640- 1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.