News

‘అయోధ్యకు ఆహ్వానం అందింది.. రాముడి విగ్రహ ప్రతిష్ఠ చూడడం నా అదృష్టం’: మోదీ

273views

ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానించింది. బుధవారం.. మోదీ నివాసానికి వెళ్లిన ట్రస్ట్ సభ్యులు.. వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమానికి మోదీని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోదీ.. ఎక్స్(ట్విట్టర్)వేదికగా తెలిపారు.

‘గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా’
“ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రారంభం నేపథ్యంలో అయోధ్యకు రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవితకాలంలో ఈ చరిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం” అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. మరోవైపు, వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు.