
228views
దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రిని సందర్శించారు. నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు కావడంతో కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద మంత్రాల ఉచ్చారణతో సీఎం జగన్‌ను అర్చకులు, పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డిని అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
కాగా దసరా శరన్నవాత్రి వేడుకలు ఇంద్రకీలాద్రిలో వైభవంగా సాగుతున్నాయి. దుర్గమ్మదేవి ఇవాళ సరస్వతీ దేవీ రూపంలో దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శని, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల విక్రయాలను అధికారులు నిలిపివేశారు.





