News

బ్రహ్మోస్‌ ఎర్త్‌ టూ ఎర్త్‌ వర్షన్ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం..!

244views

భారత వైమానిక దళం (IAF) తూర్పు ద్వీపసముద్ర తీరప్రాంతానికి సమీపంలో బ్రహ్మోస్‌ మిస్సైల్‌ ఎర్త్‌ టూ ఎర్త్‌ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది. టెస్ట్‌ ఫైర్‌ విజయవంతమైందని, మిషన్‌ అన్ని లక్ష్యాలను సాధించిందని సాధించిందని ఎయిర్‌ఫోర్స్‌ పేర్కొంది. ఈ సందర్భంగా మిస్సైల్‌కు సంబంధించిన టెస్ట్‌ ఫైరింగ్‌కు సంబంధించిన వీడియోను సైతం ట్వీట్‌ చేసింది. కిలోమీటరు దూరంలోని లక్ష్యాలను మిస్సైల్‌ చేధించనున్నది. బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పిన్‌పాయింట్‌ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని విజయవంతంగా చేధించగా.. భారతీయ అమ్ములపొదిలో మరో ‘బ్రహ్మస్త్రం’ చేరనున్నది. బ్రహ్మోస్‌ మిస్సైల్‌ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించిందని రక్షణ శాఖ అభినందించింది.