News

ఘనంగా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి తెప్పోత్సవం

293views

శ్రీ సత్య సాయి జిల్లాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి వద్ద ఉన్న చిత్రావతి నదిలో శ్రీ సత్య సాయి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఎంతో సుందరంగా అలంకరించిన ప్రత్యేక పడవలో శ్రీ సత్య సాయి బాబా చిత్రపటాన్ని ఉంచి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా సత్యసాయి ట్రస్ట్ ఆర్గనైజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ తెప్పోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాదిమంది కోనసీమ జిల్లాల సాయి భక్తులు పర్తి యాత్రగా వచ్చి తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8.30 నిమిషాల వరకు తెప్పోత్సవం కన్నులపండుగ గా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు సంబంధించిన భక్తులతో పాటు విదేశి భక్తులు పాల్గొన్నారు.