
ఉత్తరప్రదేశ్ లో మరో లవ్ జిహాద్ కేసు తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అక్కడి స్థానిక మీడియా కధనం ప్రకారం.. అహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి మొదట ఫోన్‌లో సంప్రదించినప్పుడు తనను తాను అజయ్ సింగ్ అని పరిచయం చేసుకున్నాడు. అయితే అహ్మద్ షరీఫ్ తన అసలు మతపరమైన గుర్తింపును దాచి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వారు అలీఘర్‌లో నివసించడం ప్రారంభించారు.అయితే ఐదు నెలల క్రితం అహ్మద్ షరీఫ్ మలేషియా వెళ్తూ ఆమెను అతని ఇంటికి తీసుకువెళ్ళాడు.
అతను వెళ్లిపోయిన తర్వాత, అతని కుటుంబం ఆమెను అన్నం, నీళ్ళు లేకుండా చేసి హింసించి, ఇంటి నుండి బయటకు నెట్టారు. దీంతో ఆ యువతి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల వివరాల ప్రకారం, ఆమెను అత్తమామలు ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అతని సోదరులు వారి భార్యలు ఆమెకు గొడ్డు మాంసం బలవంతంగా తినిపించగా ఆమె విముఖత వ్యక్తం చేయడంతో ఇంటి నుండి గెంటేశారు.తాను రెండు నెలల గర్భవతినని తన అత్తింటివారు నెట్టడంతో గర్భస్రావం అయిందని యువతి తెలిపిందని పోలీసులు తెలిపారు.




