News

వరస సెలవులతో శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ దర్శనానికి 10గం. సమయం

367views

వరుసగా సెలవులు రావటం సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. క్షేత్రమంతా భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది.