News

చెన్నై గంగాధరేశ్వర ఆలయానికి 6.81 కోట్లతో స్వర్ణరథం

233views

చెన్నై పురసైవాక్కంలోని గంగాధరేశ్వర ఆలయానికి 6.81 కోట్ల రూపాయలతో తయారు చేయనున్న రథం పనులను ఆ రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు బుధవారం ప్రారంభించారు. ఇందుకు దేవాదాయశాఖ నిధులు కేటాయించింది.అనంతరం మంత్రి మాట్లాడుతూ డీఎంకే పాలనలో పలు ఆలయాలకు కుంభాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. రూ.31.24 కోట్లతో కొత్తగా 51 చెక్క మహారథాలు, రూ.20 కోట్లతో స్వర్ణ రథాలు తయారు చేయిస్తున్నామని తెలిపారు. తిరుత్తణి, తిరునెల్వేలి తదితర 5 ఆలయాలకు రూ.15 కోట్లతో వెండిరథాల తయారీ పనులు జరుగుతున్నాయని తెలిపారు.