
తమిళనాడులోని మయిలడుతురైలో జరుగుగుతున్న ఆరెస్సెస్ శిక్షణ శిబిరంపై దుండగులు దాడి చేశారు. 13/5/2019 సోమవారం రాత్రి 3 గంటల సమయంలో కొందరు దుండగులు తమిళనాడు మయిలడుతురైలోని గురు జ్ఞాన సంపందర్ పాఠశాలలో జరుగుతున్న ఆరెస్సెస్ ప్రధమ వర్ష శిక్షావర్గ (20 రోజుల శిక్షణ శిబిరం) పై దాడి చేశారు. ఆరెస్సెస్ ను, హిందువులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాళ్ళు విసరడమే కాకుండా పాఠశాల ప్రధాన ద్వారాన్ని బలవంతంగా తెరవడానికి యత్నించారు. ఈ ఘటనలో క్యాంపు రక్షణ ప్రముఖ్, పట్టుకోట్టై కి చెందిన 70 యేండ్ల దురై సింగంకు గాయాలయ్యాయి. జరిగిన దాడిపై దురై సింగం ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దుండగులు ముస్లిములు అధికంగా వుండే వడక్కరై ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి ఆరుగురు అనుమానిత యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
దుండగుల వయస్సు, దాడి జరిగిన సమయాన్ని బట్టి వీరిని ఖచ్చితంగా ఏదో ఒక సంస్థకు చెందిన వారే రెచ్చగొట్టి పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుండగులకు (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) PFI తో సంబంధాలున్నట్లుగా కూడా పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.





