G20తో భారత్ సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసింది, ఏడాది పాటు వేడుకలు – మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ లో G20 సదస్సు గురించి ప్రస్తావించారు. 105వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ఆయన ఆఫ్రికన్ యూనియన్‌ని G20లో శాశ్వత సభ్య దేశంగా ఎంపిక చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు India-Middle East-Europe Economic Corridor నిర్మించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలిపారు. మరో ఏడాది పాటు G20 సదస్సుకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. ‘G20 University’ పేరుతో త్వరలోనే ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. దేశంలోని బడా యూనివర్సిటీల్లో ఈ ఈవెంట్స్ జరిగేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు వివరించారు ప్రధాని మోదీ.
ఇదే ఎపిసోడ్‌లో చంద్రయాన్ 3 సక్సెస్ గురించీ ప్రస్తావించారు. చంద్రయాన్ 3 తరవాత G0 సమ్మిట్ సక్సెస్ అవడం భారత్ సంతోషాన్ని రెట్టింపు చేసిందని అన్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి మాట్లాడారు. టూరిజం అంటే కేవలం ట్రావెలింగ్ అని మాత్రమే చూస్తామని, కానీ అది ఎంతో మందికి ఉపాధి కల్పించే రంగం అని అభిప్రాయపడ్డారు.
అలాగే రాజస్థాన్‌కి చెందిన సుఖ్‌దేవ్ జీ టీమ్ కోబ్రాని అభినందించారు ప్రధాని మోదీ. జంతువులను కాపాడేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. పాములు, పావురాలను సంరక్షిస్తున్న చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ రాజేంద్ర ప్రసాద్ ప్రస్తావనా తీసుకొచ్చి అభినందించారు.





