164
కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవోకు, అర్చకుల మధ్య వివాదం నెలకొంది. ఆలయం ఈవో దుర్భాషలాడుతూ, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు వాపోయారు. ఈవోకి వ్యతిరేకంగా ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు అర్చకులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న దేవాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.