
252views
బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం.. కర్ణాటకలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాముడిని జైల్లో పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు బజరంగ్ బలి అని నినదించేవారిని జైల్లో పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇక విశ్వహిందూ పరిషత్ సభ్యులు కూడా ఈ అంశంపై మండిపడ్డారు. బజరంగ్ దళ్‌ను ముస్లిం తీవ్ర వాద సంస్థ పీఎఫ్‌ఐతో కాంగ్రెస్ నేతలు పోల్చడంపై హిందువులు మండిపడుతున్నారు. హిందువులకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.