News

అమిత్ షా వస్తున్న వేళ బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన నక్సలైట్లు

729views

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేడు జార్ఖండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో సారైకేలా జిల్లా, కుంతీ లోక్ సభ పరిధిలోని కర్సవాన్ లోని బీజేపీ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చి వేశారు. గత అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన సక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీస్ ను పేల్చి వేశారు. కుంతి నుంచి జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కుంతితో పాటు కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో నేడు అమిత్ షా ఎన్నికల ర్యాలీలను నిర్వహించనున్నారు.

ఇది నిజంగా నక్సలైట్ల పనేనా?

ఇటీవలి కాలంలో నక్సలైట్లు పేట్రేగిపోతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో వారు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. 15 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఇక ఇప్పుడు జార్ఖండ్ లో నక్సలైట్లు తమ పంజా విసిరారు. బీజేపీ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చి వేశారు.

నక్సలైట్లు బలహీన పడ్డారనుకున్న వేళ, వారు చేస్తున్న వరుస దాడులపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించాల్సి వుంది.  అసలు ఇది నిజంగా నక్సలైట్ల పనేనా? నక్సలైట్లకి నిజంగా అంత శక్తి ఉందా? దీని వెనుక ఇస్లామిక్ తీవ్రవాదులు కూడా వున్నారా? లేదు ఇస్లామిక్ తీవ్రవాదులే నక్సలైట్ల ముసుగులో ఇదంతా చేస్తున్నారా? అసలు నక్సలైట్లు, ఇస్లామిక్ తీవ్రవాదులు కలిసిపోయి, పరస్పరం సహకరించుకుంటున్నారా? ఎవరైనా రాజకీయ నేతల హస్తాలు కూడా ఉన్నాయా? అనే పలు సందేహాలు కలుగుతున్నాయి. ఈ వరుస పేలుళ్ళ నేపధ్యంలో వీటన్నిటిపైనా సమగ్ర దర్యాప్తు నిర్వహించవలసిన అవసరం వుంది.