
605views
28ఏప్రిల్ ఆదివారం, నూతక్కి లోని నిరాశ్రిత బాలుర ఆవాసము మాతృ ఛాయలో వార్షికోత్సవం జరిగినది. వార్షికోత్సవంలో బాలుర ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారు పాల్గొని బాలురకు మార్గదర్శనం చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పలువురు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. పూర్వ విద్యార్థుల సమావేశము కూడా జరిగినది. మాతృఛాయలో చదివి వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న టువంటి విద్యార్థులు ఇంజనీర్స్, సేల్స్, ప్రొఫెషనల్స్ గా పనిచేస్తున్న వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







