
217views
శ్రీశైలం మహాక్షేత్రంలో అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వారాంతం సందర్భంగా శని, ఆది, సోమవారాలలో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. దీంతో మల్లికార్జున స్వామి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే మూడు రోజుల పాటు ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 11.40, రాత్రి 9 గంటలకు స్వామివారి స్పర్శదర్శనాలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు





