
31views
బిహార్ లోని పాట్నాలో ఓ మురికివాడలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. దీంతో ఆ మురికివాడవాసులు తీవ్ర భయాందోళనలతో పరుగులు తీశారు. కష్టపడి సంపాదించుకున్నవాటిలో చేతికి అందినవాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. గ్యాస్ సిలిండర్లు, కుర్చీలు వంటివాటిని కాపాడుకోవడం కోసం వారు అనేక కష్టాలు పడ్డారు.
పాట్నాలోని శాస్త్రి నగర్ మురికివాడలో ఈ దారుణం జరిగింది. బాధితులు ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ, తమ ప్రాణాలను, వస్తువులను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ‘‘త్వరగా పారిపొండి, త్వరగా ఖాళీ చేసేయండి’’ అంటూ జాగ్రత్తలు చెప్పుకున్నారు.
మంటలను ఆర్పేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుంటున్నారు. ఈ ప్రమాదానికి కారణాలేమిటో ఇంకా తెలియలేదు.