News

నేటి నుంచి సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

302views

నెల్లూరు జిల్లా సంగం పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5 నుంచి 15వ తేదీ వరకు పదకొండు రోజులపాటు జరగే ఈ బ్రహ్మోత్సవాల్లో కామాక్షిదేవీ సమేత సంగమేశ్వరస్వామి ప్రతి నిత్యం రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. 5న ఉదయం అంకురార్పణ, రాత్రి ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 6న రాత్రి శేషవాహనంపై గ్రామోత్సవం, 7న అశ్వవాహనం, 8న సింహవాహనం, 9న వీరభద్రస్వామి హోమం, 10న రావణసేవ, 11న నందిసేవ, 12న ఉదయం రథోత్సవం, రాత్రి పురషామృగ మహోత్సవం, 13న గిన్నెభిక్ష, రాత్రికి కల్యాణం, 14న మేష సంక్రమణ, పుణ్యకాల తీర్థవాది, సాయంత్రం అలకలతోపు, రాత్రి తెప్పోత్సవం, అనంతరం ధ్వజారోహణం, 15న గంధవడి ఉత్సవం, రాత్రి ఏకాంతసేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి రోజు సాయంత్రం స్వామి, అమ్మవారికి పూలంగిసేవ, గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణమూర్తి, ఆలయ ఈవో పెంచల వరప్రసాద్‌ కోరారు.