News

ప. గో జిల్లాలో యువతి కిడ్నాప్ కు ముస్లిం యువకుడి విఫల యత్నం – లవ్ జీహాద్ కోణం ?

2.9kviews

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరులో కిడ్నాప్‌ కలకలం రేపింది. విస్సాకోడేరు గ్రామంలో రోడ్డుపై వెళుతున్న యువతిని.. షేక్ యామ‌తుల్లా అనే యువకుడు కారులోకి లాక్కోని వెళ్లిపోయాడు. వివరాల్లోకెళితే.. ఓ త‌ల్లి తన కూతరుతో కలిసి రోడ్డుపై వెళుతుంది. ఆ సమయంలో కారులో వచ్చిన షేక్ యామ‌తుల్లా యువ‌తిని కారులో బలవంతంగా ఎక్కించాడు. ఇది చూసిన యువ‌తి త‌ల్లి కారు డోర్‌ పట్టుకుని వేలాడుతూ అడ్డుపడ్డారు.. అదే టైంలో కారు టైరు ప‌గిలినా.. కానీ ఆ యువకుడు అవేమీ పట్టించుకోకుండా కారును వేగంగా ముందుకు పొనిచ్చాడు.

దీనిని గమనించిన స్థానికులు ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. ఈలోపే షేక్ యామ‌తుల్లా యువ‌తినిను విస్సాకోడేరు నుంచి భీమవరం మండలం తాడేరు వరకు దాదాపు 10 కి.మీ తీసుకునివెళ్లాడు. యువ‌తినిను రక్షించిన స్థానికులు ఆ యువకుడిని చితకబాది.. పాలకోడేరు పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, షేక్ యామ‌తుల్లా గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ యువ‌తి వెంట పడుతున్నట్టు సమాచారం.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తోపాటు మన దేశంలోని జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలలో లవ్ జీహాద్ ప్రభావం అధికంగా వుంది. ముస్లిం యువకులు హిందూ యువతులతో స్నేహం చెయ్యడం, ప్రేమ పేరుతో వెంట పడడం, కుదరకపోతే బలవంతంగా ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్న నేపధ్యంలో ఈ సంఘటన తెలుసుకున్న హిందూ సంఘాలు ఆంధ్ర ప్రదేశ్లో కూడా లవ్ జీహాద్ పేరుతో కిడ్నాప్లు, బలవంతపు వివాహాలు మొదలయ్యాయా? అన్న సందేహం వెలిబుచ్చుతున్నారు.