News

కూచిపూడి నాట్యం పోస్టల్ విడుదల

998views

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నాట్యానికి కేంద్ర ప్రభుత్వం సముచిత స్థానాన్ని అందచేయటం ముదావహమని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్త్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది పోస్టల్ శాఖ దేశంలోని పేరెన్నిక గన్న నృత్యాలు, అత్యున్నత కళాకారులతో సోమవారం పోస్టల్ కవర్లను విడుదల చేసిందన్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు, సంగీత నృత్య కళాశాలలో రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ నాట్యాలలో నిష్ణాతులైన నాట్య గురువుల సత్కారం, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కూచిపూడి నాట్యానికి సంబంధించిన పోస్టల్ కవర్లు కూడా తంతి తపాలా శాఖ విడుదల చేయటం ప్రతి ఒక్క కూచిపూడి కళాకారులకు, నాట్యాచార్యులు, కళాభిమానులకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా కళాపీఠంలో సోమవారం రామలింగ శాస్ర్తీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీతలు వేదాంతం వెంకట దుర్గా భవానీ, బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీతలు డా. చింతా రవి బాలకృష్ణ, డాక్టర్ యేలేశ్వరపు శ్రీనివాస్, నాట్యాచార్య డాక్టర్ వేదాంతం రాధేశ్యాం, డేగల సాంబశివరావు, ఏలేశ్వరపు ఫణికుమార్, పార్థసారథి, పసుమర్తి హరనాథశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.