
232views
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మార్చి నెలలో 27 రోజుల హుండీ ఆదాయం రూ.2,11,95,988 నగదు వచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్ జోషి తెలిపారు. మంగళవారం 27 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భధ్రత, సీసీ కెమరాల నిఘా మధ్య లెక్కించినట్లు తెలిపారు. నగదుతో పాటు 571 గ్రాముల వెండి, 7 గ్రాములు బంగారు, వివిధ దేశాల డాలర్లు వచ్చినట్లు చెప్పారు. ఈ హుండీ లెక్కింపులో సూపర్నిండెంట్ అనంత పురాణిక్, ఆడిటర్ దత్తుస్వామి, కృష్ణమూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, వాణి, గురురాజ్, మాధవి పాల్గొన్నారు.





