
12views
శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీ లెక్కింపులో రూ.2,87,01,092 నగదు వచ్చింది. ఈ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో సమర్పించారు. అలాగే 162 గ్రాముల బంగారం, 7 కేజీల 110 గ్రాముల వెండి లభించాయి. 191 యూఎస్‌ఏ డాలర్లు, 110 కెనడా డాలర్లు, 35 ఇంగ్లండ్, ఏడు మలేషియా రింగిట్స్ తదితర విదేశీ కరెన్సీ లభించింది. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాలు, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్.లవన్న, అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు.