News

కన్నుల పండువగా వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

7views

ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్లలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహోత్సవాల్లో భక్తుల సందడి నెలకొంది. వేదపండితులు లక్ష్మీసమేత వెంక టేశ్వరస్వామిని రంగురంగు పూలతో అత్యంత రమణీయంగా అలకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని దర్శించు కొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. బ్రహోత్సవాల్లో భాగంగా రాత్రికి గజవాహనంపై శ్రీలక్ష్మీ అలవేలు మంగ సమేతుడై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు మంత్రో చ్చరణల మధ్య మేళతాళాలతో వెలుగొండ పురవీధుల్లో ఊరేగారు. బ్రహోత్సవాలను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం వివిద సామాజిక వర్గాల వారు అన్నదాన సత్రాలలో అన్నదానం చేశారు. తిరునాళ్ల సందర్బంగా విద్యుత్‌ ప్రభను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.