
185views
కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని ఆసియానెట్ న్యూస్ ఛానెల్ కార్యాలయాల్లో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తా కథనాన్ని ఆ ఛానెల్‌లో ప్రసారం చేసిన రెండు రోజుల తరువాత ఈ దాడులు జరిగాయని సదరు మీడియా సంస్థ తెలిపింది.
కేరళ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ సభ్యులు నిరసనల నేపథ్యంలోనే పోలీసులు సోదాలు నిర్వహించారని పేర్కొంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసుల చర్య వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.





