News

ఘనంగా చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

219views

ఉరవకొండ పట్టణంలోని గవిమఠంలో వెలసిన చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మూడో రోజు స్వామి వారు నెమలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తిని మఠం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి నెమలి వాహనంపై కొలువుదీర్చారు. గవిమఠం నుంచి ఎదురుబసవన్న గుడి వరకూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి కరిబసవరాజేంద్రస్వామి, ఆదోని చౌకిమఠం పీఠాధిపతి కల్యాణ్‌స్వామి, గవిమఠం సహాయ కమిషనర్‌ చిట్టెమ్మ, ఏజెంట్‌ రాజన్నగౌడ్‌, గవిమఠం సిబ్బంది శంకర్‌, నారాయణస్వామి, గోపి మధు, వెంటేశులు, రఘు, వీరశైవసంఘం నాయకులు, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

నేడు అడ్డపల్లకి ఉత్సవం..

చంద్రమౌళీశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా సోమవారం అడ్డపల్లకి ఉత్స వాన్ని నిర్వహించనున్నారు. స్థానిక వెలిగొండ రహదారిలో విడిది మఠం నుంచి పీఠాధిపతిని అడ్డపల్లకిపై పట్టణంలోని వీధుల గుండా ఊరేగిస్తారు. అలాగే రాత్రి ఐరావత వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.