News

శిర్లిపోతన్న, ఎల్లమ్మజాతరకు సర్వం సిద్ధం

212views

విజయనగరం జిల్లా పాలకొండ పట్టణంలో శిర్లిపోతన్న, ఎల్లమ్మజాతరకు సర్వం సిద్ధమైంది. జిల్లా నుంచి భారీగా తరలిరానున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి పోతురాజుస్వామి తిరువీధి ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అమ్మవారు, స్వామివార్లను కొలిచే కుటుంబీకులు జాగారం చేశారు. అమ్మవారు, స్వామివారి చరిత్రను జముకుల పాట రూపంలో భక్తులకు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామి సింధూర కుండ ప్రదర్శన నిర్వహిస్తారు. రాత్రి 9గంటలకు పాలజంగిడి ప్రదర్శించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. వీటిని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. వీరఘట్టంలోనూ శిర్లియాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు జరిగే ఈ యాత్రకు అన్ని ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇక్కడి శిర్లిపోతన్న, ఎల్లమ్మతల్లిని దర్శించి మొక్కులు తీర్చుకోనున్నారు. కురుపాం: కురుపాంలో మంగళవారం శిర్లి ఎల్లమ్మతల్లి యాత్ర జరగనుంది. ఇందులో భాగంగా ఆదివారం గ్రామంలో మేళతాళాలతో ఊరేగింపుగా పాల జంగిడితో జోగి దండే కార్యక్రమం చేట్టారు.