News

”మూగ”జీవుల రోధన!

436views

కాలు దూరని క్యాబిన్లలో.. గాలి చొరబడని వ్యాన్లలో.. కనికరం లేని చేతుల్లో.. కబేళాకు వెళ్లక ముందే కళేబరాలుగా మిగులుతున్న మూగ జీవాల మౌనరోదన ఇది. గంటల కొద్దీ ప్రయాణం.. కదలలేని వైనం.. ఆహారం ఇవ్వరు.. నీటి చుక్క చూపరు.. ఊరు చేరుకునే లోపే ఊపిరి ఉండచ్చు.. లేదంటే.. ఉండకపోనూవచ్చునూ.. మెడలు, కాళ్లు విరిగిపోనూవచ్చు! అసలు అవి బతికే ఉన్నాయా?.. చావుకు చిట్ట చివరన వేలాడుతున్నాయా అని కూడా వారికి అవసరం లేదు. మనసున్న సగటు మనిషికి ఈ దృశ్యాలను చూస్తే ఎంతో బాధకలగక మానదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పి.కన్నాపురం జాతీయ రహదారిపై నిత్యం పశువులు, గోవుల అక్రమ రవాణా జరుగుతుంటూనే ఉంటోంది. కానీ అడేగేవారు.. అడ్డుకునే వారు ఎవరూ లేరు. దీంతో యథేచ్చగా పశువులను కబేళాలకు అక్రమార్కులు తరలించేస్తున్నారు.