News

జపాన్‌ లో హెచ్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్వంలో నేతాజీ, రాష్‌ బిహారీలకు ఘన నివాళులు

379views

భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని గత నెల జనవరి 21న హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS) ఆధ్వర్యంలో నేతాజీకి అదేవిధంగా విప్లవకారుడు రాష్ బిహారీలకు ఘనంగా నివాళులర్పించారు. పరాక్రమ్ దివస్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని జపాన్ లోని యోకోహామాలోని తోకైచిబాలో ‘దేశ్ ప్రేమ్ దివాస్’ పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జపాన్‌లోని భారతీయ రాయబారి సీబీ జార్జ్, ఫస్ట్ సెక్రటరీ మనోజ్ సింగ్ నేగి హాజరయ్యారు. మిత్సురు తోయమా సామా ముని మనవడు షింటారో తోయామా సాన్ మరియు షిగేమారు సుగియామా సామా ముని మనవడు మిత్సుమారు సుగియామా సాన్ వీడియో సందేశం ద్వారా తమ శుభాకాంక్షలను పంపారు.

భారత్ వర్ధిల్లాలని ప్రార్థిస్తూ బృందగానం, ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జపాన్‌లోని హెచ్‌ఎస్‌ఎస్ కార్యవాహ అజయ్ నరులా గత సంవత్సరంలో జపాన్‌లో హెచ్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరం, దుస్తుల సేకరణ డ్రైవ్ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా అదే రీతిలో దేశభక్తి గీతాలు, చారిత్రక ప్రాధాన్యతాంశాలపై నృత్యాలతో సహా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ బిహారీ, బోస్ జీవితంపై పిల్లలు పలు చిత్రాలను గీసి ప్రదర్శించారు. హెచ్‌ఎస్‌ఎస్‌లోని స్వయంసేవకులు, సేవికలతో ఐఎన్‌ఏ కవాతు ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది.

సోర్సు – వీఎస్‌కే భారత్‌