ArticlesNews

2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి నిర్మల.. 2023 బడ్జెట్‌లో హైలెట్స్‌ ఇవే!

394views

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi Murmu)తో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రితోపాటు కేంద్ర మంత్రులు భగవత్ కిషన్‌రావ్ కరాద్, పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటుకు వచ్చిన మంత్రి సీతారామన్‌ బడ్జెట్‌ను సభలో చదివి వినిపించారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పథకాలను ఈ బడ్జెట్‌లో తీసుకొచ్చామని ఆమె తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉంది: నిర్మల

దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్.

ప్రస్తుత ఏడాదికి వృద్ధి రేటు 7శాతంగా అంచనా.

9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.

102 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించాం.

 

వేతనజీవులకు కేంద్రం ఊరట

ఆదాయ పన్ను పరిమితి పెంపు

రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపు

ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను

రూ.7 నుంచి 9 లక్షల వరకు 5 శాతం పన్ను

ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను

భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు

వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు

పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు…

విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు…

పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు…

భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు…

టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు….

లిథియం బ్యాటీరీలపై 21 నుంచి 13 శాతానికి కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు…

సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ లిమిట్ రూ.15 నుంచి 30 లక్షలకు పెంపు

63 వేల సొసైటీల డిజిటలైజేషన్ కోసం రూ.2,516 కోట్లు కేటాయింపు

ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి రాష్ట్రాలకు

ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం: నిర్మల

నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం

పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి శిక్షణ

స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి యూనిట్ మాల్స్

నీతి అయోగ్ మరో మూడేళ్లపాటు పొడిగింపు

దేశంలో 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ప్రభుత్వ రంగంలో కాలం చెల్లిన వాహనాలను మార్చేందుకు ప్రత్యేక నిధులు: నిర్మల

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం

నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్లు కేటాయింపు

విద్యుత్ రంగానికి రూ.35 వేల కోట్లు కేటాయింపు

దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం

5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు

కొవిడ్ సమయంలో నష్టపోయిన ఎంఎస్‌ఎంఈ లకు రిఫండ్ పథకం

నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ

ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7 వేల కోట్లు కేటాయింపు

వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు

వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్

చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి

గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు

ఏడాదికి అర్బన్‌ ఇన్‌ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు

రూ.75 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్

మేడిన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు

రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు

వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు

బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు కేటాయింపు

పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రోత్సాహం

గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు

ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు

ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం

PMAY కోసం రూ.79వేల కోట్లు

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీల నిర్మాణం

వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం

గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది

ఆత్మనిర్భర్ భారత్‌తో చేనేత వర్గానికి లబ్ధి చేకూరింది: నిర్మల