News

కుప్పకూలిన వైమానిక దళ ఫైటర్ జెట్ విమానాలు

418views

భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణ సమీపంలో కూలిపోయాయి. ‘‘మధ్యప్రదేశ్‌లోని మోరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయి, యుద్ధ విమానాలు కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాం’’ అని రక్షణశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు ఫైటర్ జెట్ విమానాలు కూలిన ఘటనపై విచారణకు ఆదేశించారు. గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి విన్యాసాలు సాగుతుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు కూలిపోయాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు రెండు ఫైటర్ జెట్ విమానాలు కూలాయని మోరీనా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని కలెక్టర్ చెప్పారు.