161
తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు లభించింది. సోమవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానులను మంగళవారం లెక్కించగా ఈ ఆదాయం లభించినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. ఇక మంగళవారం నాడు సుమారు 69,221మంది శ్రీవారిని దర్శించుకోగా, 24,409 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.