News

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి – స్వామి పరిపూర్ణ సిద్దానంద

326views

హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణ సిద్ధానంద తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సెంటర్‌లో నూతనంగా నిర్మించిన విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయం ‘అయోధ్య భవనం’ను వీహెచ్‌పీ కేంద్ర మహా మంత్రి స్థాణు మలయన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామి పరిపూర్ణ సిద్ధానంద ప్రసంగిస్తూ హిందూ ధర్మం ఎంతో గొప్పదని, దాని విశిష్టత ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా యువతరానికి తెలియజేయాలన్నారు. మరో విశిష్ట అతిథి, కారంచేడు శ్రీ వశిష్ట హరే రామ జప యజ్ఞ మఠాధిపతి స్వామి విశ్వంభరానందగిరి అనుగ్రహభాషణ చేస్తూ విశ్వమే హిందువు, హిందువే విశ్వం అనేది వేదకాలం నుంచి ఉన్నదని హిందువు అంటే పాపములు, చెడు, విషయవాంఛలు వదిలి సర్వమానవ శ్రేయస్సు కోసం కృషి చేసేవారని అన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ కేంద్రీయ కార్యకారి యక్కలి రాఘవులు, సహ కార్యదర్శి గుమ్మళ్ల సత్యం, ప్రాంత సంఘ్‌ హరికుమార్‌ రెడ్డి, దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, విజయ ఆదిత్య, కాకర్ల రాముడు, వీహెచ్‌పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.