News

వందే భారత్ పై రాళ్లేసిందెవరెంటే?

384views

విశాఖపట్నంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కంచరపాలెంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలు పనితీరులో భాగంగా బుధవారం విశాఖ రైల్వే స్టేషన్ కి ఈ రైలును రప్పించారు. సిబ్బంది, రైల్వే అధికారులు పరిశీలించిన అనంతరం సాయంత్రం విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్ కి ట్రైన్ వెళ్తుండగా కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేట వద్దకు రాగానే కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్ రైలు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. వందే భారత్ ట్రైన్ పై రాళ్ల దాడిని వాల్తేర్ డివిజన్ అధికారులు ధ్రువీకరించారు.

నగరానికి వచ్చిన వందే భారత్ రైలుపై కంచరపాలెం రామ్మూర్తి పంతులు గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి రైలు అద్దం ధ్వంసం చేసిన విషయంలో తక్షణమే విశాఖ నగర పోలీసులు స్పందించారు. జి.ఆర్.పి.ఎఫ్ కు, ఆర్. పి. ఎఫ్ కు పూర్తిగా సహకరిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వెంటనే స్పందించి నిందితులు గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఎంతో.. ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ రైలుపై ఇటువంటి సంఘటన జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి తగు చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతోంది.

రైలుపై దాడి జరిగిన ప్రదేశాన్ని వెస్ట్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి ఆర్పిఎఫ్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు సిసి ఫుటేజ్ ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు జిఆర్పిఎఫ్ , ఆర్పిఎఫ్ పోలీసులు ఒక టీంగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పదిమంది సిటీ పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్, అలాగే ఇద్దరు డిసిపిలు, ఒక క్రైమ్ డిసిపిలు కూడా వెళ్లారు.