
281views
జనవరి 12వ తేదీ నుంచి తిరుమలలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన సేవా టికెట్లు, సంబంధిత దర్శన కోటాను ఆన్‌లైన్ వర్చువల్ ద్వారా విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. అయితే శ్రీవారి ఆలయంలో బాలాలయం దృష్ట్యా ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ వర్చువల్ సేవ, అనుబంధ దర్శన టికెట్ల కోటా అందుబాటులో ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్ల ను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.





