News

గుడిలో గంట మోగించిన ఎలుగుబంటి..

394views

రొళ్ళ: సత్యసాయి జిల్లా రొళ్ళ మండలం జీరిగెపల్లి గ్రామంలోని ఆలయంలో ఓ ఎలుగుబంటి గంట మోగించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో రెండు ఎలుగుబంట్లు ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించాయి. ఆలయం లోపలికి ప్రవేశించిన ఎలుగుబంట్లలో.. ఓ ఎలుగుబంటి గుడి గంటకు వేలాడుతున్న తాడును నోట్లో కరుచుకొని.. ముందు కాళ్ళతో లాగి గంటను మోగించింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్లు తరచూగా వస్తుంటాయని.. ఇప్పటి వరకు ఎవరికి ఏ హాని తలపెట్టలేదని ఆలయ అర్చకులు అంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి