News

యువతిపై లైంగికదాడికి పాల్పడ్డ ముస్లిం సోదరులు

396views

ఛత్రినాక: శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరిని తెలంగాణలోని ఛత్రినాక పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జీఎం చావునీకి చెందని ఇబ్రహీంబేగ్‌ (24), ఉమర్‌ బేగ్‌(20) అన్నదమ్ముల పిల్లలు. స్థానికంగానే ఉండే మతిస్థిమితం లేని ఓ మహిళ (30)తో ఇబ్రహీంకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకొని ఆమెపై లైంగిక దాడి చేద్దామని అన్నదమ్ములు పథకం పన్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీం శనివారం యువతిని పిలిపించుకొని బైక్‌పై తిప్పుతూ జీఎం చావునీలో ఓ శ్మశాన వాటికలోకి తీసుకెళ్ళి లైంగికదాడి చేశాడు. అనంతరం ఉమర్‌కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి