News

యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి: వీహెచ్‌పీ

288views

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించడం పట్ల విశ్వహిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని మండిపడింది.

దేవాదాయ శాఖ వ్యాపార ధోరణి పరాకాష్ఠకు చేరుకుందని విమర్శించింది. యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాల పేరిట దోపిడి ఒక నిదర్శనం అంటూ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రావినూతల శశిధర్ విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

పార్కింగ్ దగ్గరి నుంచి మొదలు పెడితే దేవుని దర్శనాలు తీర్ధ ప్రసాదాల వరకూ హిందువులను దోచుకోవడం, దేవాలయాలతో వ్యాపారం చేయడమే దేవాదాయ శాఖ పనిగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేవాలయాల భూములు, ఆస్తులు వేలం వేసి అమ్ముకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దేవుడి దర్శనాలను కూడా వ్యాపారం చేసుకుంటూ భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి