News

అది జిహాదీ ఉగ్రదాడి!

577views

కోయంబత్తూర్‌: కోయంబత్తూర్‌లో ఈ నెల 23న జరిగిన కారు పేలుడు సంఘటన సాధారణ ప్రమాదం కాదని.. అది జిహాదీ ఉగ్రదాడి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరణించిన 29 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జమేషా ముబిన్, ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో జిహాద్‌కు సిద్ధమై, పేలుడు పదార్థాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాడని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. ముబిన్ తన కారు బాంబును ఉపయోగించి హిందూ దేవాలయంతో సహా ఒక పెద్ద ప్రాంతాన్ని ధ్వంసం చేయడానికి ఆత్మాహుతి మిషన్‌లో పాల్గొన్నాడు. కానీ, అది ప్రణాళిక ప్రకారం పని చేయలేదు.. కారు మాత్రమే పేలి అతన్ని చంపింది. మొదట్లో సాధారణ ప్రమాదంగా భావించినా ఇప్పుడు అది జిహాదీ ఉగ్రదాడి అని తేలిపోయింది.

ఉక్కడంలోని కొట్టైమేడు పరిసర ప్రాంతంలోని జమేషా ముబిన్ ఇంటి వద్ద తమిళనాడు పోలీసులు కనుగొన్న తమిళంలో చేతితో రాసిన రాతల్లో వివిధ దేవేళ్ళ పేరుతో ముస్లింలను “రెండవ తరగతి పౌరులు”, పౌరసత్వ (సవరణ) చట్టం, కర్ణాటకలో హిజాబ్ వివాదం వంటి విషయాలు వెలుగుచూశాయి. ముబిన్ నివాసం నుండి జప్తు చేయబడిన పుస్తకాలు, పఠన సామగ్రితో సహా సాహిత్యంలో డైరీలు ఉన్నాయి. జమేషా ముస్లింలను ‘రెండవ తరగతి పౌరులు’గా భావించాడు

ముబిన్ డైరీ ఎంట్రీలు ఎక్కువగా ఇతర మతాలపై, ముఖ్యంగా హిందూ మతం, క్రైస్తవ మతాలపై అతని అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి. అతను ఆ మతాల దేవతల పేర్లను ఉదహరించాడు. CAA, హిజాబ్, ఆహారంపై ఆంక్షలు, గొడ్డు మాంసంపై హత్యలు వంటి సంఘటనలు భారతీయ ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలుగా ప్రస్తావించాడు. వారు రెండవ తరగతి పౌరులుగా మారుతున్నారు. ఈ సమస్యలను ఎలా అధిగమించాలని అతని ఆలోచన చేశారు.

తమ విశ్లేషణలో ఈ కేసులో అనేక కీలకమైన అంశాలు బయటపడ్డాయని, ప్రస్తుతం దర్యాప్తును అధికారికంగా ఎన్‌ఐఎకి అప్పగించే పనిలో ఉన్నామని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు సండే ఎక్స్‌ప్రెస్‌కి తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన కోయంబత్తూరు సిటీ పోలీస్ కమిషనర్ వి.బాలకృష్ణన్ ప్రకారం… ఈ కేసులో అరెస్టయిన ఆరుగురిలో ముబిన్ సహచరులు అజారుద్దీన్, అఫ్సర్, ముస్లింలు “అణచివేత”ను ఎదుర్కొంటున్నారని దాని గురించే తరచుగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు విచారణలో తెలపారన్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని మహ్మద్ తాల్కా (వయస్సు 25), మహ్మద్ అజరుద్దీన్ (వయస్సు 25), మహ్మద్ రియాజ్ (వయస్సు 27), ఫిరోజ్ ఇస్మాయిల్ (వయస్సు 27), మహ్మద్ నవాజ్ ఇస్మాయిల్ (వయస్సు 27), అఫ్సర్ ఖాన్.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి