News

వచ్చే ఏడాది జూన్ నాటికి చంద్రయాన్- 3 ప్రయోగం

379views

శ్రీహరికోట: జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది! వచ్చే ఏడాది జూన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ వెల్లడించారు. మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్‌ను దానిద్వారా చంద్రుడిపైకి పంపనున్నట్టు తెలిపారు. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి