
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా మౌరన్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూ మైనర్ సోదరీమణులను ఇస్లాంలోకి మారాలని ముస్లిం యువకులు వారిపై తీవ్ర ఒత్తిడి చేశారు. బాధితులు లచ్చి ఖేడా గ్రామానికి చెందిన వారు. వీరిని బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. రాజ్‌వాడా స్కూల్‌లో చదువుతున్న తన ముగ్గురు కూతుళ్ళను ఆ ప్రాంతంలోని ఇస్లామిక్ వ్యక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలికలు 11, 8, 6 తరగతులు చదువుతున్నారు. వారు దాదాపు నాలుగేళ్ళుగా లచ్చి ఖేడాలో నివసిస్తున్నారు. స్థానిక యువకులు జీషన్, గుడ్డు, అతీక్, రాజా, వారి వర్గానికి చెందిన మరికొంతమంది అబ్బాయిలు వీరిని నిత్యం వేధిస్తున్నారు. ఈ నెల 15న మైనర్ బాలిక ట్యూషన్ నుండి తిరిగి వచ్చినప్పుడు, ఆమెను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా వేధించారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ), జిల్లా మేజిస్ట్రేట్(డిఎం)ని కలవకుండా తమను అడ్డుకున్నారని బాధితురాలు వెల్లడించింది.
కాగా, వీడియో ద్వారా, తనకు వివిధ నంబర్ల నుండి బెదిరింపు సందేశాలు వచ్చాయని మైనర్ ఆరోపించింది. తాము చెప్పినట్టే జీవించాలని నిందితులు తనను బెదిరించారని, తన స్వేచ్ఛా సంకల్పం ప్రకారం జీవించడానికి అనుమతించబోమని ఆమె వెల్లడించింది.
ఈ బెదిరింపు కాల్స్ చేయడమే కాకుండా, నిందితులైన యువకులు ఈ హిందూ మైనర్లను క్రమం తప్పకుండా వేధిస్తున్నారు. ముస్లిం దుస్తులు ధరించాలని, పాఠశాలకు వెళ్ళడం మానేసి, మదర్సాకు వెళ్ళి చదువుకోవాలని ఒత్తిడి తెచ్చారు. తమ డిమాండ్లకు అనుగుణంగా లేకుంటే వారిని కిడ్నాప్ చేస్తామని కూడా నిందితులు బాలికలకు హెచ్చరించారు.
పోలీసులు జీషన్, రాజా, అతిక్, మరో నలుగురిపై అభియోగాలు మోపారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాత తమకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని బాధితురాలి తల్లిదండ్రులు పంచుకున్నారు. నిందితుల్లో ఒకరైన కైఫ్‌ను రక్షించే ప్రయత్నంలో హైదరాబాద్ నుంచి అలాంటి కాల్ వచ్చిందని తండ్రి చెప్పారు.
Source: HINDU POST





