News

అమ్మాజీ ఆలయ పరిసరాల్లో ఎలుగుబంట్లు… భక్తుల ఆందోళన

52views

సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని జీరిగేపల్లి గ్రామ శివారులో ఉన్న అమ్మాజీ ఆలయంలో రెండు ఎలుగుబంట్లు సంచరించాయి. ఈ దృశ్యాలు గుడిలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో భక్తులు, ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులో ఉన్న అమ్మాజీ దేవాలయంలో భక్తులు రోజు పూజలు నిర్వహిస్తారు. ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు, ఆ గుడికి వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి