News

ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో భారీ డంప్ స్వాధీనం

59views

సీలేరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో పోలీసులు మావోయిస్టు భారీ డంప్​ను గుర్తించారు. అండ్రహల్‌, సిందిపుట్, ఒండైపొదర్, ముదులిపడలో గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దులోని గ్రామాల్లో పోలీసు బలగాలు జల్లెడ పడుతున్న సమయంలో మావోయిస్టుల డంప్‌ గుర్తించారు. ఈ డంప్‌లో 31 జిలెటిన్‌ స్టిక్స్‌, 11 ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, రెండు టిఫిన్‌ బాంబులు, ఒక ప్రెసర్‌ కుక్కర్‌ బాంబ్‌ దొరికాయి. రూ.70వేల నగదు లభించిందని కోరాపుట్ ఎస్పీ వరుణ్ గుంటపళ్లి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి