
480views
ఇరాన్: ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజు రోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. 22 ఏళ్ళ యువతి మహ్సా ఆమిని హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు చంపారని
తోటి మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కొందరు తమ జట్టును కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ళ నుంచి జట్టును కప్పుకునే ఉంటున్నామని లేదంటే పాఠశాలకు వెళ్ళేందుకు, ఉద్యోగాలు తెచ్చుకునేందుకు వీలుండడం లేదని చెబుతున్నారు. లింగ వివక్ష పాలనతో విసిగిపోయామని అక్కడి మహిళలు నిప్పులు చెరుగుతున్నారు.





