
524views
-
చర్చికి తాళం వేసి, పోలీసులకు ఫిర్యాదు
ముమ్మిడివరం: కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చర్చికి వచ్చే మహిళలను ఫాదర్ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దేవుని ఆరాధన విషయాలకంటే మహిళల అలంకరణ, నడవడికల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారని చర్చికి తాళం వేసి సంఘ కాపరిని నిలదీశారు. చర్చి ఫాదర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత ఏడు నెలల నుంచి అతని తీరు మారడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి కృప కోసం చర్చికి వస్తున్న తమను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.







