News

5-18 ఏళ్ల పిల్లలకు ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్…

418views

* క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి కోరిన భారత్ బయోటెక్

18 ఏళ్లు పైబడిన వారికి ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కోవ్యాక్‌ (బీబీవీ154) అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ నెల 6న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 5-18 ఏళ్ల వయసు వారికి ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు (ఇంట్రానాసల్‌) కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ (ఫేజ్‌-3) ప్రయోగాలు నిర్వహించేందుకు ఔషధ నియంత్రణ సంస్థ ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా-డీసీజీఐ’ను భారత్‌ బయోటెక్‌ అనుమతి కోరింది. 5-18 ఏళ్ల వారికి మూడో దశ పరీక్షల్లో ఆయా వయసుల వారికి ఇది అందించే భద్రత, రోగనిరోధక శక్తి తదితరాలపై మదింపు జరుపుతారు. కొవాగ్జిన్ ‌తో బీబీవీ154 రోగ నిరోధక శక్తి, భద్రతను పోల్చి చూసేందుకు మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్ ‌కు డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. దేశంలో 9 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.