News

జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తిదే ప్రధాన పాత్ర: మోదీ

411views

తిరుపతి: భారత్‌ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ రకమైన ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం నిరంతరంగా పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. శ్రామికశక్తిని సామాజిక పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.

గురువారం సాయంత్రం తిరుపతి వేదికగా జరిగిన జాతీయ కార్మిక సదస్సును ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌.హెచ్‌ భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల కార్మిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కార్మిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కార్మికుల సదస్సుకు పవిత్ర స్థలాన్ని వేదిక చేసుకోవడం అభినందనీయమని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కార్మిక, ఉపాధి కల్పన, పెట్రోలియం, సహజవాయు శాఖల సహాయ మంత్రి రామేశ్వర్‌ కూడా పాల్గొన్నారు. దేశాన్ని ఒక్కటి చేయడంలో కార్మికుల పాత్ర అభినందనీయమని ప్రధాని కొనియాడారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి